టైప్-1, టైప్-2 మధుమేహం గురించి తెలిసిందే... కానీ టైప్-1.5 మధుమేహం కూడా ఉందని తెలుసా...?
- ప్రాణాంతక ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి
- బాగా ప్రాచుర్యంలో టైప్-1, టైప్-2 డయాబెటిస్
- ఎల్ఏడీఏ పేరిట మరో రకం
- ఇది వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన సమస్య
ప్రపంచంలో అత్యధిక శాతం మంది ప్రజలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో మధుమేహం అతి ప్రధానమైనది. ఏమరుపాటుతో ఉన్నామంటే శరీరంలోని అవయవాలన్నింటినీ దెబ్బతీసి ప్రాణాపాయ స్థితిని కలిగిస్తుంది. కాగా, మధుమేహంలో టైప్-1, టైప్-2 రకాల గురించి అందరికీ తెలిసిందే. కానీ టైప్-1.5 డయాబెటిస్ కూడా ఉందని చాలామందికి తెలియదు. దీన్ని ఎల్ఏడీఏ (లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్) అని పిలుస్తారు.
టైప్-1, టైప్-2 లక్షణాల్లో కొన్ని ఈ టైప్-1.5 రకంలోనూ కనిపిస్తాయి. ఈ మధ్యరకం మధుమేహం 40 ఏళ్లకు పైబడినవారిలో కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఆటోఇమ్యూన్ కారకం ఉంటుంది. ఎప్పుడైతే పేంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం ఆపేస్తుందో, అప్పుడీ ఆటోఇమ్యూన్ కారకం పొరబాటున ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణజాలంపై దాడి చేసి నాశనం చేస్తుంది.
శరీర కణజాలాన్ని కాపాడాల్సిన వ్యాధి నిరోధక వ్యవస్థే ఇలా ఎందుకు చేస్తుందన్నది ఇప్పటికీ స్పష్టతలేదు. ఆటోఇమ్యూన్ స్థితి అనేది కొంతవరకు జన్యు పరంగా సంక్రమింస్తుందని మాత్రం నిపుణులు భావిస్తుంటారు.
ఈ టైప్-1.5 ఎల్ఏడీఏ మధుమేహం లక్షణాలు గురించి చెప్పుకోవాల్సి వస్తే... ఇది ప్రధానంగా వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన వ్యాధి. ఒకసారి ఎల్ఏడీఏకి గురయ్యాక... ఆహారంలో మార్పులు, జీవనశైలిని మార్చుకోవడం వల్ల దీన్ని కట్టడి చేయడం ఏమాత్రం కుదరదు.
టైప్-1 డయాబెటిస్ తరహాలోనే ఎక్కువసార్లు మూత్ర విసర్జన, అధిక దాహం, కంటిచూపు మందగించడం, బరువు తగ్గిపోవడం, పేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వంటి లక్షణాలు ఈ టైప్-1.5 మధుమేహంలోనూ కనిపిస్తాయి.
చాలామంది ఈ మధ్యతరహా మధుమేహాన్ని టైప్-2 మధుమేహంగా పొరబడుతుంటారు. దీన్ని గుర్తించేందుకు గ్లుటామిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ యాంటీబాడీస్ (జీఏడీ) టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ దాడులను ఈ పరీక్ష ద్వారా విశ్లేషించవచ్చు. జీఏడీ అనేది ఒక యాంటీబాడీ. ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే పేంక్రియాస్ కణాలను ఇది నాశనం చేస్తుంది.