పుకార్లకు 'రిప్' అంటూ సంతాపం ప్రకటించిన చార్మీ!
- ఇటీవల లైగర్ పరాజయం
- నిరాశకు గురైన చిత్రబృందం
- సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు
- పూరీ కనెక్ట్స్ ను పైకి తీసుకురావడమే తమ లక్ష్యమన్న చార్మీ
లైగర్ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేకపోయింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రబృందం కూడా యథాశక్తి ప్రచారం చేసింది. కానీ అభిమానుల తీర్పు మరోలా ఉండడంతో లైగర్ యూనిట్ కు నిరాశ తప్పలేదు.
అయితే, లైగర్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్ల పరంపర మొదలైంది. పూరీ జగన్నాథ్ ముంబయి నుంచి మకాం మార్చేశాడంటూ కథనాలు వస్తున్నాయి. అటు, విజయ్ దేవరకొండతో పూరీ తీయాల్సిన జనగణమన ప్రాజెక్టును కూడా పక్కనబెట్టేశారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా, పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థ భాగస్వామి చార్మీ కౌర్ ట్విట్టర్ లో స్పందించారు. పుకార్లు పుకార్లు పుకార్లు... పుకార్లన్నీ ఫేక్ అంటూ పేర్కొన్నారు. ఇలాంటి రూమర్లను తాము పట్టించుకోవడంలేదని, పూరీ కనెక్ట్స్ ఎదుగుదలపైనే దృష్టి సారించామని చార్మీ స్పష్టం చేశారు. అప్పటిదాకా "పుకార్లకు రిప్" అంటూ సంతాపం ప్రకటించారు.
కొన్నిరోజుల కిందటే చార్మీ సోషల్ మీడియాకు విరామం ప్రకటిస్తున్నానంటూ ఓ ట్వీట్ చేశారు. పూరీ కనెక్ట్స్ ఈసారి మరింత ఘనంగా తిరిగొస్తుందంటూ పేర్కొన్నారు. అప్పటివరకు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు.