'క్యూఆర్ సామ్' అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించిన భారత్
- ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే వీలున్న క్యూఆర్ సామ్
- ఇప్పటిదాకా ఆరు పరీక్షలు విజయవంతం
- త్వరలోనే భారత సైన్యానికి అప్పగింత
- డీఆర్డీవో, సైన్యాన్ని అభినందించిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన మరో సమర్థవంతమైన అస్త్రం క్యూఆర్ సామ్ (క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్). తాజాగా క్యూఆర్ సామ్ ను ఒడిశాలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజి నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇప్పటివరకు ఆరు పర్యాయాలు దీన్ని పరీక్షించగా, అన్నిసార్లు నిర్దేశిత అంచనాలను అందుకుంది. త్వరలోనే దీన్ని భారత సైన్యంలో చేర్చనున్నారు.
కాగా, క్యూఆర్ సామ్ ప్రయోగాల సందర్భంగా ఇందులోని ప్రతి వ్యవస్థ అత్యంత కచ్చితత్వంతో పనిచేసినట్టు గుర్తించారు. గగనతలంలో వేగంగా కదిలే లక్ష్యాలను ఛేదించడంలో క్యూఆర్ సామ్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.
ఈ మిస్సైల్ ప్రత్యేకతలు ఏంటంటే... దీన్ని కదులుతున్న వాహనం నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీంట్లో ఉండే సెర్చ్ అండ్ ట్రాక్ వ్యవస్థలు శత్రు లక్ష్యాలను స్వయంగా గుర్తించి విధ్వంసానికి మార్గం సుగమం చేస్తాయి.
క్యూఆర్ సామ్ పరీక్షలు విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీవో వర్గాలను, సైన్యాన్ని అభినందించారు.