పులివెందుల ప్రజలకు జగన్ పాలనపై వ్యతిరేకత పెరిగింది: బీటెక్ రవి
- వైసీపీకి చెందిన 15 కుటుంబాలు టీడీపీలో చేరాయన్న రవి
- చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి చేరారని వ్యాఖ్య
- తనతో పాటు శ్రీనివాసరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వెల్లడి
కడప జిల్లా పులివెందులలో వైసీపీకి చెందిన 15 కుటుంబాలు తమ పార్టీలో చేరాయని టీడీపీ నేత బీటెక్ రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారని బీటెక్ రవి ట్విట్టర్ లో తెలిపారు.
సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనే ఆయనకు వ్యతిరేక పెరుగుతోందని ఈ సందర్భంగా బీటెక్ రవి అన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన 15 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పులివెందులలో బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.