ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో స్వీట్ బాక్స్ చూసి అవాక్కయిన కస్టమ్స్ అధికారులు

  • స్వీట్ బాక్స్ అట్టపెట్టె మడతల్లో విలువైన సౌదీ కరెన్సీ
  • బ్యాగులోనూ కొంత దాచిపెట్టిన ప్రయాణికుడు
  • వీటి విలువ రూ.54 లక్షలుగా గుర్తింపు
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. బుధవారం టెర్మినల్ 3 వద్ద సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. అతడి వద్ద విదేశీ కరెన్సీ ఉందని అనుమానించి కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సదరు వ్యక్తి బ్యాగులో, అలాగే స్వీట్ బాక్స్ లోనూ ఎవరూ గుర్తించలేని విధంగా సౌదీ కరెన్సీని పెట్టుకుని వచ్చినట్టు గుర్తించారు. 

స్వాధీనం చేసుకున్న సౌదీ కరెన్సీ విలువ రూ.54 లక్షలుగా ప్రకటించారు. స్వీట్ బాక్స్ అట్ట పెట్టె ఫోల్డింగ్ లలో కనిపించని విధంగా నోట్లను మడిచి పెట్టడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ ప్రయాణికుడి విగ్గు నుంచి రూ.30 లక్షల విలువ చేసే బంగారాన్ని కూడా ఇదే మాదిరి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో పట్టుకోవడం గమనార్హం. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)


More Telugu News