లోన్ యాప్ లపై కఠిన చర్యలకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
- అంతకంతకూ పెరిగిపోతున్న లోన్ యాప్ ల ఆగడాలు
- బెదిరింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న బాధితులు
- ఆర్బీఐ అనుమతులు లేని లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
లోన్ యాప్ ల ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. లోన్ నిర్వాహకుల ఆగడాలకు ఎంతోమంది జీవితాలు నాశనమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
మరోవైపు లోన్ యాప్ బెదిరింపులు తట్టుకోలేక రాజమండ్రికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూడ్ ఫొటోలు షేర్ చేస్తామంటూ బెదిరించడంతో వారు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో, వీరి పిల్లలు నాగసాయి (4), లిఖిత శ్రీ (2) అనాధలుగా మిగిలారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరికీ చెరో రూ. 5 లక్షలు సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.