నెల్లూరు జిల్లా ముసునూరులో దళిత యువకుడు కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్
- ఇటీవల ముసునూరులో కరుణాకర్ ఆత్మహత్య
- వైసీపీ నేతల వేధింపులకు బలయ్యాడన్న భార్య
- జగన్ పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదన్న లోకేశ్
- హామీలపై ప్రశ్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నెల్లూరు జిల్లా విచ్చేశారు. ముసునూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. కరుణాకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరుణాకర్ ఇద్దరు పిల్లల విద్యా బాధ్యతలు తానే చేపడతానని లోకేశ్ ప్రకటించారు. కరుణాకర్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జగన్ పాలనలో దళితుల ప్రాణాలకు, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని లోకేశ్ విమర్శించారు. దళితులపై జరుగుతున్న హింసాకాండలో ఒక్క కేసులోనూ వైసీపీ నేతలకు శిక్ష పడలేదని అన్నారు. హామీలు నిలబెట్టుకోవాలని అడుగుతున్న దళితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేశ్ తో కరుణాకర్ భార్య మాట్లాడుతూ, వైసీపీ నేతల వేధింపులే తన భర్తను బలిగొన్నాయని ఆరోపించారు. అంతకుముందు లోకేశ్... కరుణాకర్ ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకున్న వారి నుంచి ఆ పత్రాలను విడిపించి కరుణాకర్ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఈ పర్యటనలో లోకేశ్ వెంట సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వంగలపూడి అనిత కూడా ఉన్నారు.