హైదరాబాదులో మళ్లీ భారీ వర్షం

హైదరాబాదులో మళ్లీ భారీ వర్షం
  • ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు
  • తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన
  • ఈ మధ్యాహ్నం హైదరాబాదులో కొన్ని ప్రాంతాల్లో వర్షం
  • సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో వర్షం
  • రోడ్లపై నిలిచిన నీరు... వాహనదారులకు ఇక్కట్లు
నిన్న హైదరాబాదులో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ కూడా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షం కురియగా, సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

గోషామహల్, కొత్తగూడ, చార్మినార్, అమీర్ పేట, ఆసిఫ్ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, మాదాపూర్, గచ్చీబౌలి, నిజాంపేట్, కేపీహెచ్ బీ, జియాగూడ, ఖైరతాబాద్, సోమాజిగూడ, కూకట్ పల్లి, మాదాపూర్, బహుదూర్ పుర, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, మెహదీపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. 

రోడ్లపై భారీగా నీరు నిలిచిపోగా, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, ఈ వర్షాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


More Telugu News