జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన క్రీడల మంత్రి రోజా
- క్రీడాశాఖపై సమీక్ష నిర్వహించిన రోజా
- సచివాలయం బ్లాక్-2లో సమావేశం
- క్రీడాకారులకు, క్రీడాశాఖకు యాప్ వారధిలా నిలుస్తుందన్న రోజా
- ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యమని వెల్లడి
ఏపీ క్రీడల శాఖ మంత్రి రోజా ఇవాళ జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించారు. ఏపీ సచివాలయం బ్లాక్-2లో క్రీడాశాఖ అధికారులతో ఈ రోజు మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా రూపొందించిన జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ఈ సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ద్వారా క్రీడాకారులు సంక్షిప్తంగా తమ వివరాలు అందజేస్తే, వారి సమాచారం క్రీడాశాఖకు చేరడం సులభతరం అవుతుందని వివరించారు. ఈ యాప్ నేపథ్యంలో, సమాచారం అందించే క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామని రోజా తెలిపారు.
ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ లక్ష్యం దిశగా క్రీడాశాఖ ముందుకు వెళ్లేందుకు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఈ యాప్ ఓ వారధిలా నిలుస్తుందని రోజా అభిప్రాయపడ్డారు.