ఆ ఫ్లాప్ తో మూడు నెలలు బయటికి రాలేదు: శర్వానంద్
- శర్వా తాజా చిత్రంగా 'ఒకే ఒక జీవితం'
- ఎమోషన్స్ తో కూడిన టైమ్ ట్రావెల్ కథ
- సరైన కథ కోసం వెయిట్ చేశానన్న శర్వా
- ఈ నెల 9వ తేదీన విడుదల
శర్వానంద్ - రీతూ వర్మ జంటగా 'ఒకే ఒక జీవితం' సినిమా రూపొందింది. అమ్మ ప్రేమను పొందడం కోసం కాలంలో వెనక్కి వెళ్లే ఒక కొడుకు కథ ఇది. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ సంభాషణలు అందించడం విశేషం. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన శర్వానంద్ ను ఇంటర్వ్యూ చేశాడు.
శర్వానంద్ మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో నేను చేసిన సినిమాల్లో నాలుగైదు ఫ్లాప్ అయ్యాయి. ఆ జాబితాలో 'పడి పడి లేచే మనసు' ఒకటి. ఈ సినిమా తప్పకుండా ఆడుతుందనే బలమైన నమ్మకంతో చేశాను. ఎండల్లో .. వానల్లో ఈ సినిమా కోసం ఎంతో కష్టపడటం జరిగింది. ఆ సినిమా పోయినప్పుడు నేను పూర్తిగా అప్సెట్ అయ్యాను .. మూడు నెలలపాటు ఇంట్లో నుంచి బయటికి రాలేదు.
ఆ సినిమా పరాజయం నుంచి నేను కోలుకోవడానికి కొంతకాలం పట్టింది. ఆ తరువాత ఫ్లాపులు వచ్చినా సర్దుకున్నాను. ఫ్లాపుల నుంచి పాఠాలను నేర్చుకున్నాను. భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనే విషయాలను తెలుసుకున్నాను. ఆరు నెలల పాటు ఆలోచన చేసి ఎంచుకున్న కథనే 'ఒకే ఒక జీవితం'. ఇది తప్పకుండా గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.