బగ్ ఉంటే పట్టుకుని చెప్పండి.. రూ.25 లక్షలు ఇస్తాం: గూగుల్

  • సెక్యూరిటీ పరిశోధకులకు చక్కని ఆఫర్
  • ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ విషయమై సవాల్
  • లోపం స్థాయి ఆధారంగా నగదు బహుమానం
సెక్యూరిటీ పరిశోధకులకు గూగుల్ ఓ సవాల్ విసిరింది. తన ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ అయిన ‘గూగుల్ ఓఎస్ఎస్’లో బగ్స్ ను గుర్తించి చెప్పిన వారికి 31,337 డాలర్లను (రూ.25 లక్షల బహుమానం) ఇస్తానని ప్రకటించింది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ లో గుర్తించిన ప్రతి లోపానికి ఇంత మొత్తం రాదు. దాని తీవ్రత ఆధారంగా ఇచ్చే మొత్తం 100 డాలర్ల నుంచి 31,337 డాలర్ల వరకు ఉంటుంది.

ఈ కార్యక్రమానికి ‘బగ్ బౌంటీ ప్రోగ్రామ్’ అని గూగుల్ పేరు పెట్టింది. పరిశోధనలను ప్రోత్సహించనున్నట్టు తెలిపింది. నిబంధనలను జాగ్రత్తగా చదవాలని కోరింది. ఒకవేళ గుర్తించిన లోపం అసాధారణంగా ఉంటే వారితో కలసి పనిచేస్తామని గూగుల్ ప్రకటించింది. నగదు బహుమానానికి అదనంగా, ప్రజా గుర్తింపు కూడా లభిస్తుందని పేర్కొంది. నగదు బహుమతి గెలుచుకున్న వారు ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తే, రెట్టింపు మొత్తాన్ని తాము అందిస్తామని గూగుల్ తెలిపింది.


More Telugu News