ఛేజింగ్ లో శ్రీలంకకు శుభారంభం అందించిన ఓపెనర్లు
- ఆసియా కప్ లో సూపర్-4 మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు
- లక్ష్యఛేదనలో లంక దూకుడు
- 7 ఓవర్లలో 63 పరుగులు
టీమిండియాపై 174 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కుశాల్ మెండిస్, పత్తుమ్ నిస్సాంక జోడీ 7 ఓవర్లలో 63 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. నిస్సాంక 24 బంతుల్లో 36, మెండిస్ 18 బంతుల్లో 27 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లు విసిరి 9 పరుగులివ్వగా, అర్షదీప్ సింగ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అర్షదీప్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులు ఇచ్చాడు. ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది.