ఆసుపత్రిలో జడేజా... త్వరగా కోలుకోవాలన్న చెన్నై సూపర్ కింగ్స్
- పాక్‌తో మ్యాచ్‌లో 35 పరుగులతో రాణించిన జడేజా
- హాంకాంగ్‌తో మ్యాచ్‌లో జడేజా మోకాలికి గాయం
- ఆపరేషన్ అవసరమన్న వైద్యులు
- ఆసియా కప్ నుంచి వైదొలగిన ఆల్ రౌండర్
గాయం కారణంగా ఆసియా కప్ సిరీస్ నుంచి పూర్తిగా వైదొలగిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం ఆసుపత్రిలో పేషంట్‌గా కనిపించాడు. ఆసియా కప్‌లో ఆడే భారత జట్టులో సభ్యుడిగా ఎంపికైన జడేజా జట్టుతో కలిసి దుబాయి చేరి రెండు మ్యాచ్‌లు కూడా ఆడాడు. తొలుత పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన జడేజా... హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ తీశాడు. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే జడేజా మెకాలికి గాయమైంది. ఈ గాయం కారణంగానే అతడు ఆసియా కప్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
మోకాలికి అయిన గాయానికి ఆపరేషన్ అవసరమని వైద్యులు తేల్చడంతో త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు కూడా జడేజా ఆడటం అనుమానంగానే ఉంది. గాయానికి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన జడేజా ఫొటోను ఐపీఎల్‌లో అతడి జట్టు చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. గాయం నుంచి జడేజా త్వరగా కోలుకోవాలని, అతడు మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉందంటూ ఆ జట్టు ఆకాంక్షించింది.