అమరావతి మాస్టర్ ప్లాన్ అక్రమాల కేసులో.. మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
- అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు
- నారాయణ, అంజనీ కుమార్, లింగమనేని రమేశ్ సహా పలువురిపై సీఐడీ కేసులు
- ముందస్తు బెయిల్ కోసం నారాయణ, అంజనీ కుమార్, లింగమనేని రమేశ్ పిటిషన్లు
- నారాయణ, అంజనీ కుమార్‌లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు మంగళవారం ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో నారాయణతో పాటు లింగమనేని రమేశ్, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీ కుమార్ సహా పలువురు వ్యక్తులపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. వీరందరిపై ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ, అంజనీకుమార్, లింగమనేని రమేశ్ లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు నారాయణ, అంజనీకుమార్‌లకు మాత్రమే మందుస్తు బెయిల్ మంజూరు చేసింది.