ఏపీ మరో రూ.1,000 కోట్ల అప్పు తీసుకుంది: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీ రెడ్డి
- ఆర్బీఐ బాండ్ల ద్వారా సేకరించిందన్న జీవీ రెడ్డి
- రాష్ట్ర అప్పు రూ.47,608 కోట్లకు చేరిందని వెల్లడి
- కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల వివరాలు లేవన్న టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం మరో రూ.1,000 కోట్ల మేర రుణం తీసుకుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. మంగళవారం ఆర్బీఐలో జరిగిన బాండ్ల వేలంలో పాల్గొన్న ఏపీ ఈ రుణాన్ని తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ రుణంతో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఏపీ తీసుకున్న మొత్తం అప్పు రూ.47,608 కోట్లకు చేరిందని జీవీ రెడ్డి తెలిపారు. ఏపీకి ఈ ఏడాదికి ఏఫ్ఆర్‌బీఎం పరిమితి రూ.48 వేల కోట్లుగా ఉందని కూడా ఆయన వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల వివరాలు అందుబాటులో లేవని జీవీ రెడ్డి తెలిపారు.