వారాల వ్యవధి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన కేటీఆర్.. ఇవిగో ఫొటోలు
- ఇటీవలే కిందపడటంతో కేటీఆర్ కాలు బెణికిన వైనం
- 3 వారాల విశ్రాంతి అవసరమన్న వైద్యులు
- కరోనా తోడు కావడంతో బయటకే రాని కేటీఆర్
- తాజాగా మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మంత్రి
ఓ వైపు కరోనా, మరోవైపు బెణికిన కాలు కారణంగా విశ్రాంతి తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం తొలిసారి తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. మంగళవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా... సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్ చేయి పట్టుకుని మరీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వీరి వెంట మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ తదితరులు ఉన్నారు.
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత నానక్‌రామ్‌గూడ్‌లో వరల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా కేటీఆర్ కింద పడిపోగా... ఆయన కాలు బెణికిన సంగతి తెలిసిందే. ఈ గాయం తగ్గేందుకు కనీసం 3 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో కేటీఆర్ ఇంటిగడప దాటలేదు. తాజాగా కాలు గాయం మానడం, కరోనా కూడా నెగెటివ్‌గా రావడంతో మంగళవారం కేటీఆర్ చాలా రోజుల తర్వాత తొలిసారి బయటకు వచ్చారు.