యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో వరంగల్ కు చోటు

  • గతేడాది రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు
  • ఏడాది వ్యవధిలోనే వరంగల్ నగరానికీ యునెస్కో గుర్తింపు
  • హర్షం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
  • మోదీ ఘనత అంటూ బీజేపీ ప్రచారం
  • కేసీఆర్, కేటీఆర్ ల కృషి అంటూ ఎర్రబెల్లి ట్వీట్
ఐక్యరాజ్యసమితి సంస్థ యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో వరంగల్ నగరానికి స్థానం లభించింది. గతేడాది ఓరుగల్లు రామప్ప గుడికి యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడం తెలిసిందే. ఏడాది వ్యవధిలో మరోసారి యునెస్కో గుర్తింపునకు నోచుకోవడం విశేషం. 

దీనిపై 'గ్రేట్ న్యూస్' అంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణలోని వరంగల్ నగరం కూడా యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకుందని తెలిపారు. ఈ ఆనందమయ క్షణాల నేపథ్యంలో వరంగల్ కు, తెలంగాణకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.

 కాగా, ఇది ప్రధాని మోదీ ఘనత అని తెలంగాణ బీజేపీ ప్రచారం చేసుకుంటుండగా, ఈ గుర్తింపు కోసం కృషి సల్పిన సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.


More Telugu News