చైనాలో భూకంపం... 30 మంది మృతి
- నైరుతిభాగంలో తీవ్ర ప్రకంపనలు
- రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రత నమోదు
- కాంగ్ డింగ్ నగరానికి 43 కిమీ దూరంలో భూకంప కేంద్రం
- 10 వేల మందిపై ప్రభావం
చైనా నైరుతి భాగాన్ని శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. దీని ప్రభావంతో 30 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సిచువాన్ ప్రావిన్స్ లోని కాంగ్ డింగ్ నగరానికి నైరుతి దిక్కున 43 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది.
కాగా, కరోనా ప్రభావంతో ఇప్పటికీ లాక్ డౌన్ లో ఉన్న చెంగ్డు నగరంలోనూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావంతో 10 వేల మంది ప్రభావితులయ్యారని చైనా ప్రభుత్వ టీవీ చానల్ పేర్కొంది. పలు ప్రాంతాల్లో బండరాళ్లు దొర్లిపడడంతో రహదారులు మూసుకుపోయాయి. టెలీకమ్యూనికేషన్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది.