జోరు వానలోనే వైఎస్ షర్మిల ప్రసంగం... వీడియో ఇదిగో
- ప్రజా ప్రస్థానం పేరిట యాత్ర చేస్తున్న షర్మిల
- ప్రస్తుతం పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
- కల్వకుర్తిలో వర్షంలోనే ప్రసంగించిన మహిళా నేత
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరిట తెలంగాణలో చేపట్టిన పాదయాత్ర సోమవారం నాటికి 143వ రోజుకు చేరుకుంది. పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న ఈ యాత్రలో భాగంగా సోమవారం కల్వకుర్తి చేరుకున్న షర్మిల... అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. షర్మిల ప్రసంగం మొదలు కాగానే జోరున వర్షం మొదలైంది. అయితే వర్షాన్ని ఏమాత్రం పట్టించుకోని షర్మిల వర్షంలో తడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన షర్మిల... ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ ఆగం జేశారని మండిపడ్డారు. తాజాగా వీఆర్ఏలను కూడా ఆగం జేసే పనిలో కేసీఆర్ ఉన్నారని ఆమె ఆరోపించారు. 43 రోజులుగా వీఆర్ఏలు దీక్ష చేస్తున్నా.. వారిలో ఓపిక నశించి, అప్పుల బాధతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. కేసీఆర్ కు పట్టడం లేదని ఆమె ధ్వజమెత్తారు.