కొవిడ్ సమయంలోనూ పాతబస్తీలో రంజాన్ జరిపారు... మేం అడ్డుకున్నామా?: బండి సంజయ్
- నిబంధనల పేరుతో నిమజ్జనాన్ని అడ్డుకుంటున్నారన్న సంజయ్
- ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తామని హెచ్చరిక
- హిందువుల పండుగలు జరుపుకోలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు నిబంధనల పేరుతో ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, ప్రగతిభవన్ కు తీసుకువచ్చి నిమజ్జనం చేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. గణేశ్ వ్రిగహాల ఎత్తు, పర్యావరణ నిబంధనలు అంటూ నిమజ్జనానికి ఇబ్బందులు కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో హిందువుల పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునే పరిస్థితి కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. కరోనా ముమ్మరంగా వ్యాపిస్తున్న సమయంలోనూ పాతబస్తీలో రంజాన్ జరుపుకున్నారని, బాదం పిస్తాలు పంచారని, అయినా తాము అడ్డుకోలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. కానీ నిబంధనల పేరిట హిందువుల పండుగలను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు.