పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద అభ్యర్థుల కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్

  • విజయవాడలో కెరీర్ వరల్డ్ కోచింగ్ సెంటర్
  • ప్రారంభించిన విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్
  • సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
  • స్టడీ మెటీరియల్, బెస్ట్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేశారంటూ అభినందనలు
దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడలో కెరీర్ వరల్డ్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ కోచింగ్ సెంటర్ ను విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ జయామోహన్ ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు, వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు స్థానిక శిశు విహార్ లో ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా డీఆర్ఎమ్ శివేంద్ర మోహన్ మాట్లాడుతూ, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ కోచింగ్ సెంటర్ లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని తెలిపారు. స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నారని, నిపుణులైన ఫ్యాకల్టీతో శిక్షణ అందిస్తున్నారని కొనియాడారు.


More Telugu News