కిండ పడ్డ టీచర్ కళ్లద్దాలను వంగి తీసిచ్చిన సీఎం జగన్... ఫొటో ఇదిగో
- ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసిన సీఎం జగన్
- అవార్డుల ప్రదానోత్సవం వేదిక మీద కింద పడిపోయిన టీచర్ కళ్లద్దాలు
- తానే స్వయంగా వంగి తన చేతులతో కళ్లద్దాలు తీసిన జగన్
- ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కీర్తిస్తూ జగన్ వ్యాఖ్యలు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీచర్ల సన్మాన వేదికపై ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తున్న సందర్భంగా, తన చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి వచ్చిన ఓ ఉపాధ్యాయుడి కళ్లద్దాలు కింద పడిపోగా... వెనువెంటనే స్పందించిన జగన్ తానే స్వయంగా కిందకు వంగి మరీ ఆ కళ్లద్దాలను తన చేతులతో తీసి ఉపాధ్యాయుడికి అందజేశారు.
అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను గుండెలకు హత్తుకుని అభినందించిన జగన్... సమాజంలో ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరించారు. ఒక మంచి టీచర్ ఒక స్కూలును, ఒక వ్యవస్థను మార్చగలడని జగన్ చెప్పారు. గ్రామంతో మొదలుపెట్టి.. గొప్ప విప్లవాన్ని తీసుకురాగలుగుతాడని కూడా ఆయన ఉపాధ్యాయులను కీర్తించారు. తన కన్న పిల్లలకోసమే కాదు, తరగతిలో ఉన్న పిల్లలు కూడా బాగుపడాలని టీచర్ ఆరాటపడతాడని జగన్ వ్యాఖ్యానించారు.