'ఉగ్రం' షూటింగ్ ప్రారంభం!
- 'నాంది'తో హిట్ కొట్టిన అల్లరి నరేశ్
- అదే కాంబినేషన్లో మొదలైన 'ఉగ్రం'
- సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
- కథానాయికగా మిర్నా పరిచయం
అల్లరి నరేశ్ హీరోగా ఆ మధ్య వచ్చిన 'నాంది' సినిమా, ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడమే కాదు, నటన పరంగా ఆయనకి ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఆ తరువాత నరేశ్ 'సభకు నమస్కారం' సినిమాతో సెట్స్ పైకి వెళ్లాడు. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.
దాంతో ఆయన తనకి 'నాంది' సినిమాతో హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'ఉగ్రం' సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ రోజున ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో 'మిర్నా' కథానాయికగా పరిచయమవుతోంది.
విభిన్నమైన కథాకథానాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో విలక్షణంగా ఉండనుందని అల్లరి నరేశ్ చెబుతూ వస్తున్నాడు. అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు.