ఉద్ధవ్ థాకరేకు గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది: అమిత్ షా
- ముంబయిలో బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం
- థాకరే బీజేపీకి నమ్మకద్రోహం చేశాడన్న షా
- రాజకీయాల్లో నమ్మకద్రోహాన్ని సహించలేమని వ్యాఖ్య
- బీఎంసీ ఎన్నికల్లో థాకరేకు బుద్ధి చెప్పాలని పిలుపు
- జాతీయ మీడియాలో కథనం
శివసేనతో బీజేపీ వైరం కొనసాగుతోంది. ముంబయిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర బీజేపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కమలనాథుల వైఖరి స్పష్టమైంది. ఉద్ధవ్ థాకరే బీజేపీకి నమ్మకద్రోహం చేశాడని, అతడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఏదైనా సహించవచ్చేమో కానీ నమ్మకద్రోహాన్ని మాత్రం భరించలేమని షా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న బృహన్ ముంబయి కార్పొరేషన్ ఎన్నికల్లో మిషన్ 150 సాధించడం ద్వారా ఉద్ధవ్ థాకరేకు బుద్ధి చెప్పాలని అమిత్ షా బీజేపీ నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు అమిత్ షా తమ పార్టీ నేతలకు కర్తవ్య బోధ చేశారని జాతీయ మీడియాలో కథనం వచ్చింది.
గతంలో మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, బీజేపీ తర్వాత బద్ధశత్రువుల్లా మారాయి. ఇటీవల శివసేనలో షిండే సంక్షోభంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.