ఆ సమయంలో నన్ను పలకరించింది ధోనీ ఒక్కడే: కోహ్లీ
- ఎంతో మంది వద్ద తన నంబర్ ఉందన్న కోహ్లీ
- ధోనీ తప్ప ఎవరూ మెస్సేజ్ చేయలేదని వెల్లడి
- టీవీ ముఖంగా సూచనలు ఇవ్వడం సరికాదన్న మాజీ కెప్టెన్
ఆసియాకప్ 2022లో సూపర్ 4లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన తర్వాత భారత్ జట్టు తరఫున విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మీడియాతో మ్యాచ్ గురించి మాట్లాడడం అరుదు. ఈ సందర్భంగా ఈ ఏడాది జనవరిలో టెస్ట్ కెప్టెన్ గా తప్పుకున్న నాటి అనుభవాలను పంచుకున్నాడు.
‘‘మీకు ఓ విషయం చెబుతాను. నేను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు నాకు ఒకే ఒక్కరి నుంచి టెస్ట్ మెస్సేజ్ వచ్చింది. అది కూడా నేను గతంలో కలసి ఆడిన ఎంఎస్ ధోనీ నుంచి. ఎంతో మంది దగ్గర నా నంబర్ ఉన్నప్పటికీ, నాకు వచ్చిన స్పందన అదొక్కటే. ఎంతో మంది నాకు టీవీ ముఖంగా సూచనలు ఇచ్చారు. వారు ఎంతో చెప్పాలనుకున్నారు. వారి దగ్గర నా నంబర్ కూడా ఉంది. అయినా కానీ, ఎవరూ మెస్సేజ్ చేయలేదు.
ఎవరో ఒకరి గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటే నేరుగా వారికే చెబుతాను. ప్రపంచం ముందు బహిరంగంగా వారికి సూచనలు ఇస్తే, నా ఉద్దేశ్యం ప్రకారం వాటికి ఏ మాత్రం విలువ ఉండదు. నా పురోగతి కోసమే చెప్పేట్టు అయితే నేరుగా నన్నే చేరుకోవాలి’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.