భోగాపురం విమానాశ్రయానికి త్వరలోనే శంకుస్థాపన

  • విశాఖ విమానాశ్రయాన్ని తరలించేందుకు నౌకాదళం అనుమతి
  • ఢిల్లీలో నౌకాదళం-ఏపీఏడీసీఎల్ మధ్య ఎంవోయూ
  • విశాఖ ఎయిర్‌పోర్టులోని 170 ఎకరాలను నౌకాదళానికి ఇచ్చేందుకు అంగీకారం
  • మిగతా 130 ఎకరాలు ఏఏఐకి అప్పగింత
విశాఖపట్టణం విమానాశ్రయాన్ని తరలించేందుకు నావికాదళం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురంకు తరలించే అంశానికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై ఇటీవల ఢిల్లీలో నౌకాదళం, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) అధికారులు సంతకాలు చేశారు.

మరోవైపు, భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూములపై నమోదైన కేసులకు సంబంధించి త్వరలోనే తుదితీర్పు కూడా రానుంది. తీర్పు వచ్చిన వెంటనే శంకుస్థాపన చేయాలని అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ విమానాశ్రయంలోని 170 ఎకరాలను నౌకాదళానికి కేటాయించేలా అగాహన ఒప్పందంలో రాసుకున్నట్టు సమాచారం.  మిగిలిన 130 ఎకరాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి అప్పగించనున్నారు.


More Telugu News