సైరస్ మిస్త్రీ మరణం పట్ల ప్రధాని మోదీ స్పందన

  • మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం
  • సంతాపం తెలియజేసిన ప్రముఖులు
  • దిగ్భ్రాంతికి గురైన మోదీ, చంద్రబాబు తదితరులు
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబయి తిరిగొస్తుండగా మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ ను ఢీకొట్టింది.

సైరస్ మిస్త్రీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మిస్త్రీ మరణం పట్ల సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యుల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సైరస్ మిస్త్రీ అకాలమరణం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. మిస్త్రీ భారత ఆర్థిక శక్తిని విశ్వసించే వ్యక్తి అని తెలిపారు. ఆయన మరణం వ్యాపార వర్గాలకు తీరని లోటు అని వివరించారు. అటు, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కూడా సైరస్ మిస్త్రీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైరస్ మిస్త్రీ దూరదృష్టి గల వ్యాపారవేత్త అని పేర్కొన్నారు. 

అటు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మిస్త్రీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మిస్త్రీ చిన్నవయసులోనే ఈ లోకాన్ని వీడడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.


More Telugu News