టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన పాకిస్థాన్
- ఆసియాకప్ లో మరోసారి భారత్, పాక్ ఢీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
- ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు
- 3 ఓవర్లలో 34 పరుగులు
ఆసియా కప్ సూపర్-4 దశలో టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్లు ఓసారి తలపడగా, భారత్ నే విజయం వరించింది. ఈసారి కూడా పాక్ పై ఆధిపత్యం చలాయించాలని భారత్ కోరుకుంటుండగా, ఓటమికి ప్రతీకారం కోసం పాక్ తహతహలాడుతోంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఇద్దరు స్పిన్నర్లకు చోటిచ్చింది. గాయంతో వైదొలగిన రవీంద్ర జడేజా స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు అవకాశం ఇచ్చారు. మరో స్పిన్నర్ గా చహల్ జట్టులో ఉన్నాడు.
కాగా, మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 3 ఓవర్లు ముగిసేసరికి 34 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ దాటిగా ఆడుతూ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 16 పరుగులు చేయగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 18 పరుగులు చేశాడు.