పవన్ కల్యాణ్ పవర్ అలాంటిది మరి.. రీ రిలీజ్లోనూ రికార్డు బద్దలు
- పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 1న ‘జల్సా’ రీ రిలీజ్
- ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం
- రూ. 1.73 కోట్లు రాబట్టిన ‘పోకిరి’ రీ రిలీజ్ రికార్డు బద్దలు కొట్టిన ‘జల్సా’
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ మామూలుగా ఉండదు. రెండేళ్లకో సినిమాతో వచ్చినా.. రాజకీయాల్లోకి వెళ్లినా ఆయన ఫ్యాన్స్ బేస్ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర పవన్ స్టామినా ఏ రేంజ్ లో ఉంటుందో తాజాగా ‘జల్సా’ రీ రిలీజ్ ఉదాహరణగా నిలిచింది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 1వ తేదీన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా చూసేందుకు ప్రపంచం వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. కొత్త సినిమా స్థాయిలో టిక్కెట్లు కొని థియేటర్లో సందడి చేశారు. మొత్తంగా 702 షోలు ప్రదర్శించారు. ఈ చిత్రం రూ. 3.20 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో, రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ చిత్రంగా ‘జల్సా’ రికార్డు సృష్టించింది. మహేశ్ బాబు పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ అయిన ‘పోకిరి’ రూ. 1.73 కోట్లు సాధించినట్టు సమాచారం. ‘జల్సా’ దానికి రెట్టింపు వసూళ్లు రాబట్టడంతో పవన్ స్టామినా ఏమిటో మరోసారి తెలిపింది.
ఈ చిత్రం నైజాం ప్రాంతం నుంచి సుమారుగా రూ. 1.2 కోట్లు వసూలు చేయగా, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు రాబట్టింది. కృష్ణాలో రూ. 21 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షల కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా రూ 2.35 కోట్ల గ్రాస్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ 3.20 కోట్లు వచ్చినట్టు లెక్కగట్టారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్‌లకు ‘జల్సా’ ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ సంజయ్ సాహూ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన సరసన ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటించారు.