అవినీతి కేసులో సస్పెండ్ అయిన షేక్‌పేట తహసీల్దార్ సుజాత మృతి
- 2020లో అవినీతి కేసులో అరెస్ట్ అయిన సుజాత
- ఆమె ఇంట్లో జరిగిన సోదాల్లో పెద్ద ఎత్తున పట్టుబడిన సొమ్ము
- విచారణకు పిలవడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్న భర్త
- భర్త మరణం, అవినీతి కేసులు, అరెస్టులతో మానసికంగా కుంగిపోయిన సుజాత
అవినీతి కేసులో అరెస్ట్ అయి సస్పెన్షన్‌లో ఉన్న షేక్‌పేట తహసీల్దార్ సీహెచ్ సుజాత (46) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుజాతకు బ్లడ్ కేన్సర్ ఉన్నట్టు ఇటీవలే బయటపడింది. కీమో థెరపీ చేయించుకుంటున్న ఆమె నిన్న గుండెపోటుకు గురయ్యారు. ఆమె బతికించేందుకు నిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రక్త కేన్సర్ కారణంగానే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
సుజాత షేక్‌పేట తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో 2020లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు దొరికింది. సుజాతను అరెస్ట్ చేసి జైలుకు పంపిన అధికారులు ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త అజయ్ కుమార్‌ను విచారణకు పిలిచారు. దీనిని అవమానంగా భావించిన ఆయన భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మరణానికి తోడు, అవినీతి కేసులో అరెస్ట్, విధుల నుంచి సస్పెన్షన్ వంటివి సుజాతను మానసికంగా కుంగదీశాయి. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన ఆమె నిన్న మరణించారు.