లంచగొండి ఎస్సైకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన హైదరాబాద్ ఏసీబీ కోర్టు
- స్వాధీనం చేసుకున్న వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు రూ. 10 వేల లంచం అడిగిన ఎస్సై
- మాటు వేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
- రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించిన కోర్టు
లంచగొండి ఎస్సైకి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ప్రస్తుతం మాదాపూర్‌లో పనిచేస్తున్న ఎస్సై కె.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీస్ స్టేసన్‌లో ఎస్సైగా పనిచేశారు. జూన్ 2013లో స్వాధీనం చేసుకున్న ఇర్షాద్ ఖురేషీ వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు రాజేంద్ర రూ. 10 వేలు డిమాండ్ చేశారు.
దీంతో ఖురేషీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మాటు వేసిన ఏసీబీ అధికారులు.. రాజేంద్రకు ఖురేషీ రూ. 10 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. నిందితుడైన ఎస్సై రాజేంద్రను దోషిగా పరిగణించి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. లంచం చెల్లించకుంటే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.