మాపై ఎంత ఒత్తిడి ఉంటుందో టీమిండియాపైనా అంతే ఒత్తిడి ఉంటుంది: పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ వ్యాఖ్యలు
- రేపు ఆసియాకప్ లో భారత్ వర్సెస్ పాక్
- ఇప్పటికే గ్రూప్ దశలో తలపడిన జట్లు
- తాజాగా సూపర్-4లో అమీతుమీ
- బ్యాటుకు బంతికి మధ్య సమరమన్న రిజ్వాన్
ఆసియా కప్ లో ఇప్పటికే ఓసారి తలపడిన భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్-4 దశలో మరోసారి అమీతుమీకి సిద్ధమయ్యాయి. రేపు (సెప్టెంబరు 4) ఇరుజట్ల మధ్య దుబాయ్ లో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఒత్తిడి రెండు జట్లపైనా ఉంటుందని స్పష్టం చేశాడు. ఒత్తిడి పాక్ పై ఎంత ఉంటుందో, భారత్ పైనా అంతే ఉంటుందని పేర్కొన్నాడు.
ఆడుతున్నది భారత్ తోనా, హాంకాంగ్ తోనా అనేది చూడొద్దని తమ ఆటగాళ్లకు చెప్పానని రిజ్వాన్ వెల్లడించాడు. ఇది బ్యాటుకు బంతికి మధ్య సమరం మాత్రమేనని వారికి వివరించానని తెలిపాడు. భారత్ తో మ్యాచ్ అంటే ఒత్తిడి సహజమేనని, అయితే తాము నిబ్బరంగా, ప్రశాంతంగా ఆడేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు.