విమానంతో వాల్ మార్ట్ స్టోర్ లోకి దూసుకొస్తానంటూ పైలట్ బెదిరింపు... అమెరికాలో ఘటన
- టుపేలో పట్టణంలో గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
- పైలట్ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు
- వాల్ మార్ట్ స్టోర్ ను ఖాళీ చేయించిన వైనం
అమెరికాలోని మిస్సిసిపి రాష్ట్రంలోని టుపేలో పట్టణంలో ఓ పైలట్ అటు పోలీసులు, ఇటు ప్రజలను హడలగొట్టాడు. విమానంతో వాల్ మార్ట్ స్టోర్ లోకి దూసుకొచ్చేస్తానంటూ బెదిరించాడు. ఆ పైలట్ విమానంతో గాల్లో చక్కర్లు కొడుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అతడి బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు అక్కడున్న స్టోర్లను ఖాళీ చేయించారు. ఆ పైలట్ తో పోలీసులు చర్చలకు ఉపక్రమించారు. అతడి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, ఆ పైలట్ టుపేలో ఎయిర్ పోర్టు నుంచి చిన్న విమానం (బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్-90) దొంగిలించినట్టు భావిస్తున్నారు. ఆ రెండు ఇంజన్ల విమానంలో విమానంలో 9 సీట్లు ఉంటాయి. కాగా, ఆ పైలట్ గాల్లోనే చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, వాల్ మార్ట్ స్టోర్ సమీపానికి ప్రజలు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరించారు. టుపేలో పట్టణంలో 40 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పటికే ఫైర్, అంబులెన్స్, పోలీసు బలగాలను మోహరించారు.
అయితే, ఆ పైలట్ చివరికి ఓ ప్రాంతంలో విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేశాడు. అనంతరం, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రాష్ ల్యాండింగ్ సందర్భంగా ఎలాంటి ప్రమాదం సంభవించలేదని తెలుస్తోంది.