కబ్జాకు గురైన పొలం కోసం పోరాడుతూ రత్నం అనే రైతు తహసీల్దారు కార్యాలయంలో ప్రాణాలు వదలడం కలచివేసింది: చంద్రబాబు

  • చిత్తూరు జిల్లాలో ఓ రైతు విషాదాంతం
  • కబ్జా అయిన పొలం కోసం పోరాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో మృతి
  • వైసీపీ నేతల స్వార్థానికి ఇంకెందరు బలికావాలంటూ బాబు ఆగ్రహం
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రత్నం అనే రైతు తహసీల్దార్ కార్యాయంలో ప్రాణాలు విడిచిన ఉదంతంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. రైతు రత్నం గారు కబ్జాకు గురైన తన పొలం కోసం పోరాడుతూ పెనమూరు తహసీల్దారు కార్యాలయంలో ప్రాణాలు వదిలిన వార్త మనసును కలచివేసిందని తెలిపారు. వైసీపీ నేతల స్వార్థానికి ఇంకెంతమంది సామాన్యులు బలికావాలని చంద్రబాబు ప్రశ్నించారు. 

న్యాయస్థానం పర్మినెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చాక కూడా ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రత్నం గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని స్పష్టం చేశారు.


More Telugu News