సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినం: తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యం

  • 3 గంట‌ల పాటు కొన‌సాగిన కేబినెట్ భేటీ
  • ఈ నెల 16,17, 18 తేదీల్లో వ‌జ్రోత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని తీర్మానం
  • రాష్ట్రవ్యాప్తంగా వేడుక‌లకు కేబినెట్ నిర్ణ‌యం
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర కేబినెట్ భేటీ శ‌నివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగింది. దాదాపుగా 3 గంట‌ల‌కు పైగా జ‌రిగిన కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌గా... సెప్టెంబ‌ర్ 17న నిర్వ‌హించాల్సిన కార్య‌క్ర‌మాల‌పై కేబినెట్ కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినంగా ప‌రిగ‌ణించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. 

అంతేకాకుండా సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని కూడా కేబినెట్ తీర్మానించింది. అంతేకాకుండా ఈ నెల 16,17,18 తేదీల్లో జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాల్లో భాగంగా వ‌జ్రోత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని కూడా కేబినెట్ నిర్ణ‌యించింది. వ‌జ్రోత్స‌వాల్లో భాగంగా ప్రారంభ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తీర్మానించింది.


More Telugu News