నిర్మల మీడియా సమావేశం నుంచి పలువురు జర్నలిస్టులను పంపేసిన బీజేపీ
- హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్మల మీడియా సమావేశం
- టీ న్యూస్, తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ విలేకరులను పంపేసిన బీజేపీ
- అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించిన బండి సంజయ్
తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మధ్యాహ్నం తన పర్యటనను ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో భాగంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశానికి దాదాపుగా అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మరికాసేపట్లో మీడియా సమావేశానికి నిర్మలా సీతారామన్ రానున్నారనగా... పలు మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులను బీజేపీ నేతలు అక్కడి నుంచి పంపించి వేశారు. ఇలా నిర్మల మీడియా సమావేశం నుంచి పంపేసిన జర్నలిస్టుల్లో టీ న్యూస్ ఛానెల్, తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ పత్రిక విలేకరులు ఉన్నారు.
ఇదే విషయాన్ని నిర్మల మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రకటించారు. అనవసర రాద్ధాంతం చేయడంతో పాటుగా పొంతన లేని ప్రశ్నలతో విసిగించే కొన్ని మీడియా సంస్థలకు చెందిన విలేకరులను మర్యాదపూర్వకంగానే వెళ్లిపోవాలని చెప్పినట్లు ఆయన తెలిపారు.