బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్ల ఫైనల్ లిస్టు ఇదేనా...?
- రేపటి నుంచి తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్
- హోస్ట్ గా మరోసారి నాగార్జున
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 20 మంది పేర్లు
- వీళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంటూ కథనాలు
ఇప్పటివరకు ఐదు సీజన్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త సీజన్ రేపు (సెప్టెంబరు 4) ప్రారంభం కానుంది. బిగ్ బాస్-6కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా, బిగ్ బాస్ కొత్త సీజన్ కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ జాబితా ప్రచారంలో ఉంది. గత సీజన్ల తరహాలోనే సినీ, టీవీ, రేడియో జాకీ, యూట్యూబ్ తారలను బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటిదాకా 20 మంది కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలాదిత్య (నటుడు), నేహా చౌదరి (యాంకర్), చంటి (కమెడియన్), రోహిత్-మెరీనా దంపతులు, రేవంత్ (సింగర్), ఇనయా సుల్తానా, శ్రీహాన్, పింకీ (నటి సుదీప), శ్రీసత్య (బుల్లితెర నటి), గీతూ రాయల్, ఆర్జే సూర్య, ఆరోహీ రావ్ (యాంకర్), కీర్తి, ఫైమా (కమెడియన్), రాజశేఖర్, వసంతి (నటి), అర్జున్, ఆదిరెడ్డి, షాన్నీ... ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే పోటీదారులు అంటూ కథనాలు వస్తున్నాయి. మరి ఇదే ఫైనల్ లిస్టు అని తేలాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
కాగా, ఈసారి కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రారంభ ఎపిసోడ్ సెప్టెంబరు 4 (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మా చానల్లో ప్రసారం కానుంది.