ప్రతి పథకంలోనూ కేంద్రం వాటా ఉంది: నిర్మలా సీతారామన్
- జహీరాబాద్ పార్లమెంటులో పర్యటించిన నిర్మల
- తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన వైనం
- కేంద్రం లోగోలు, ప్రధాని ఫొటోలను ఎందుకు వినియోగించరన్న కేంద్ర మంత్రి
దేశంలోని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని పథకాల్లోనూ కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పర్యటనకు వచ్చిన నిర్మల... గడచిన మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనను ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళుతున్న సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆమె నగరంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రాలు అమలు చేసే పథకాల్లో 60 శాతం వాటా కేంద్రానిదేనన్న నిర్మల... కేవలం 40 శాతం నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని తెలిపారు. అలాంటప్పుడు ఆయా పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తొలగిస్తాయని ఆమె ప్రశ్నించారు. ఆయా పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ లొగోలను, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను ఎందుకు వినియోగించరని ఆమె ప్రశ్నించారు. అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నందున... ఆ నిధులు పక్కదారి పట్టకుండా డిజిటలైజేషన్ చేశామని నిర్మల చెప్పారు.