టీటీడీకి షాక్ ఇచ్చిన కోర్టు.. భక్తుడికి రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశం

  • 2006లో మేల్ చాట్ వస్త్రం సేవను బుక్ చేసుకున్న హరి భాస్కర్
  • దీని కోసం రూ. 12,250 చెల్లించిన భాస్కర్
  • ఇంత వరకు అవకాశం కల్పించని టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. ఒక భక్తుడికి దర్శనం కలిగించకపోవడాన్ని తప్పు పట్టిన కోర్టు... సదరు భక్తుడికి రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు సేలంకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడు మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ. 12,250 చెల్లించారు. ఇప్పటి వరకు ఆయనకు దర్శనం లభించలేదు. గత 17 ఏళ్లుగా టీటీడీకి పలుమార్లు  ఫిర్యాదు చేసినా ఏ మాత్రం స్పందన లేకపోయింది. కరోనా సమయంలో మేల్ చాట్ వస్త్రం సేవకు బదులుగా వీఐపీ టికెట్ ఇస్తామని టీటీడీ ఆఫర్ చేసింది. 

అయితే, దానికి హరి భాస్కర్ ఒప్పుకోలేదు. మేల్ చాట్ వస్త్రం సేవే కావాలని డిమాండ్ చేశాడు. అతని విన్నపాన్ని టీటీడీ పట్టించుకోకపోవడంతో... ఆయన సేలంలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల కోర్టు భాస్కర్ కు సంవత్సరం లోపు మేల్ చాట్ వస్త్రం సేవను కల్పించాలని... లేకపోతే బాధితుడికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.


More Telugu News