రక్తంలో గ్లూకోజ్ తక్కువ ఉంటే.. కనిపించే సంకేతాలు ఇవే..

  • ఉన్నట్టుండి విపరీతమైన ఆకలి అనిపించొచ్చు
  • ఏకాగ్రత లోపించినా అనుమానించాలి
  • ఆందోళన, మాటతడబాటు కూడా సంకేతాలే
రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే అది మధుమేహం. మరి తక్కువైతే అది దీన్ని హైపో గ్లైసీమియాగా చెబుతారు. రక్తంలో షుగర్ ఎక్కువైతే కాదు, తక్కువైనా సమస్యలు ఎదురవుతాయి. రక్తంలో షుగర్ ఎక్కువైతే (హైపర్ గ్లైసీమియా) గుండె, మూత్రపిండాలు, రక్తనాణాలు దీర్ఘకాలంలో దెబ్బతింటాయి. తక్కువైతే అయోమయం, తల తిరగడం, కోమా లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించొచ్చు. 

ఎంత ఉండాలి..?
బ్లష్ షుగర్ 70ఎంజీ కంటే తక్కువ ఉంటే వెంటనే వైద్యుల సాయం తీసుకోవాలి. ఇలా తక్కువగా ఉందన్న విషయాన్ని కొన్ని సంకేతాలు చెబుతాయి. ఆకలి బాగా వేయడం, ఆందోళన, మూడ్ మారిపోవడం, ఏకాగ్రతలేమి అనిపిస్తాయి. షుగర్ ఇలా తగ్గిపోయినప్పుడు తక్షణ ఫలితం కోసం పండ్ల రసం తీసుకోవచ్చు. 

ఆకలి
ఉన్నట్టుండి విపరీతమైన ఆకలి వేస్తుందంటే అది బ్లడ్ షుగర్ తగ్గిపోయిన సంకేతంగా చూడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్నాక్ సమయంలో 15-20 గ్రాముల కార్బో హైడ్రేట్లు, భోజనం సమయంలో 40-65 గ్రాముల వరకు తీసుకోవచ్చు.

ఆందోళన 
రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గిపోయినప్పుడు శరీరం ఎపినెఫ్రిన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. దీన్నే అడ్రెనలిన్ అంటారు. అలాగే, కార్టిసాల్ కూడా విడుదల అవుతుంది. దీంతో రక్తంలోకి మరింత షుగర్ ను కాలేయం విడుదల చేస్తుంది. ఇదే ఆందోళనకు దారితీస్తుంది.

భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం
మూడ్ మారిపోవడం, ఉన్నట్టుండి భావోద్వేగాల్లో మార్పులు హైపో గ్లైసీమియా లక్షణాలుగా చూడొచ్చు. చిరాకు, డిప్రెషన్ మాదిరిగానూ అనిపించొచ్చు.

ఏకాగ్రత లేమి
శక్తి కోసం రక్తంలో షుగర్ విడుదల అయ్యేందుకు మెదడు సంకేతాలు ఇస్తుంటుంది. గ్లూకోజ్ తగ్గిపోయినప్పుడు మెదడు సరిగ్గా పనిచేయలేదు. దీంతో దేనిమీద అయినా ఏకాగ్రత చూపించడం కష్టం కావచ్చు.

మాట తడబాటు
మెదడుకు శక్తి తగ్గిపోవడం వల్ల మాటలు తడబాటుకు గురికావచ్చు. 40ఎంజీ/డీఎల్ కు షుగర్ పడిపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.


More Telugu News