క్రికెట్ ప్రపంచంలో భారత్ ‘లాడ్లాస్’: పాక్ మాజీ కెప్టెన్ హఫీజ్

  • ద్వైపాక్షిక సిరీస్ ను భారత్ స్పాన్సర్ చేస్తే జాక్ పాట్ కొట్టినట్టే
  • అధిక ఆదాయాన్ని సృష్టించే జట్టుగా టీమిండియాను పేర్కొన్న హఫీజ్
  • ఎక్కువ సంపాదించే వారినే సమాజం ఇష్టపడుతుందని వ్యాఖ్య
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ బీసీసీఐ పట్ల ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్ కు భారత్ ‘లాడ్లాస్’ (ప్రియమైన) అని అభివర్ణించాడు. ఎందుకంటే బీసీసీఐ భారీ ఆదాయాన్ని పొందుతుంటుందని అన్నాడు. 

‘‘నాకు పెద్దగా తెలియదు. కానీ, మన సమాజంలో ఎవరు ఆర్జిస్తారో వారినే ఎక్కువ మంది ఇష్టపడతారని తెలుసు. వారే ఎక్కువ మందికి లాడ్లాగా ఉంటారు. ప్రతి ఒక్కరి నుంచి ప్రేమను అందుకుంటారు. టీమిండియా ఎక్కువ ఆదాయాన్ని సృష్టించే దేశం. ప్రపంచంలో ఎక్కడైనా బీసీసీఐ ద్వైపాక్షిక సిరీస్ ను స్పాన్సర్ చేస్తే చాలు వారు జాక్ పాట్ కొట్టినట్టే. ఈ విషయాలను ఎవరూ కాదనలేరు’’ అని హఫీజ్ పీటీవీ స్పోర్ట్స్ తో అన్నాడు. 

భారత్ లాడ్లాస్ అన్నది బాగా ఆడడం వల్లా? లేక మరింత ఆదాయాన్ని ఆర్జించడం వల్లా? అని యాంకర్ ప్రశ్నించగా, ఆదాయం వల్లేనని హఫీజ్ పేర్కొన్నాడు. 



More Telugu News