కరోనా టీకాకు వ్యతిరేకంగా రూ.1,000 కోట్ల పరిహారం కోరుతూ పిటిషన్

  • టీకా దుష్ప్రభావాలతో తన కుమార్తె మరణించిందన్న పిటిషనర్
  • నష్ట పరిహారం ఇప్పించాలంటూ బాంబే హైకోర్టులో పిటిషన్
  • సీరమ్ ఇనిస్టిట్యూట్, బిల్ గేట్స్ కు నోటీసులు
కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోవిషీల్డ్ టీకా కారణంగా తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని, రూ.1,000 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ దిలీప్ లునావత్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. 

2020లో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. భారత్, ఇతర దేశాల కోసం 10 కోట్ల డోసుల తయారీని వేగవంతం చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశ్యం. 

తన కుమార్తె డాక్టర్ అని, ఎస్ బీఎంటీ డెంటల్ కాలేజీ లెక్చరర్ గా పనిచేసేదని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన పిటిషనర్ లునావత్ హైకోర్టుకు తెలిపారు. సదరు హాస్పిటల్ లో సిబ్బంది అందరూ టీకా డోస్ తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది, ఎటువంటి రిస్క్ ఉండదని తన కుమార్తెకు హామీ ఇచ్చినట్టు పిటిషనర్ లునావత్ వివరించారు. 2021 జనవరి 28న తన కుమార్తె టీకా తీసుకోగా.. దుష్ప్రభావాల కారణంగా మార్చి 1న చనిపోయినట్టు తెలిపారు. దీంతో పరిహారం ఇప్పించాలని కోరారు. 




More Telugu News