యూఎస్ లో తగ్గని 'సీతా రామం' దూకుడు!

  • ఆగస్టు 5న విడుదలైన 'సీతా రామం'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • యూఎస్ లోను అదే జోరు 
  • కథాకథనాలు .. సంగీతమే ప్రధానమైన బలం
  • బెస్ట్ క్లాసికల్ అనిపించుకున్న సినిమా    
దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా 'సీతా రామం' సినిమా రూపొందింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లోను ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. క్లాసికల్ హిట్ అనిపించుకుని దూసుకుపోయింది. ఇక యూఎస్ లో ఈ సినిమా అంచనాలకి మించిన ఆదరణను సొంతం చేసుకుంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమాగా నిలిచింది. 

ఇంతవరకూ ఈ సినిమా అక్కడ 1.35 మిలియన్ ప్లస్ డాలర్స్ ను రాబట్టుకుంది. త్వరలోనే 1.5 మిలియన్ మార్కును టచ్ చేయవచ్చని అంటున్నారు. బలమైన కథాకథనాలు .. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలకి తోడు, విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించిందని చెప్పచ్చు.


More Telugu News