కంగారూల రెజ్లింగ్.. లాస్ట్ పంచ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో ఇదిగో

  • ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా నేచర్ రిజర్వ్ లో ఆకట్టుకున్న దృశ్యం
  • మొదట ఒకదానికొకటి ఆవేశంగా పోరాటం మొదలుపెట్టిన కంగారూలు
  • ముందరి కాళ్లతో కిక్ ఇచ్చిన ఒక కంగారూ
  • పక్కన ఫెన్సింగ్ రేకులు విరగ్గొట్టుకుని పడిపోయిన మరో కంగారూ
అప్పుడప్పుడూ కొన్ని రకాల జంతువులు కొట్టుకోవడం, ఒకదాని వెంట మరొకటి పరుగెడుతూ పోరాడటం చూస్తూనే ఉంటాం. మనకు తరచూ కనిపించే.. పిల్లులు, శునకాల పోట్లాట తెలిసిందే. కానీ ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో ఉన్న మౌంట్ టేలర్ నేచర్ రిజర్వ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో.. కంగారూల పోట్లాట మాత్రం ఓ రేంజ్ లో అలరిస్తోంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పోటీల్లో క్రీడాకారుల్లా పంచ్ ల మీద పంచ్ లు వేసుకుంటూ, రెజ్లింగ్ తరహాలో ప్రత్యర్థిని గట్టిగా పట్టుకుంటూ.. అవి పోరాడిన దృశ్యం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

రోడ్డు పక్కన పోట్లాడుతూ..
  • మౌంట్ టేలర్ నేచర్ రిజర్వులో ఓ రోడ్డు పక్కన రెండు కంగారూలు చేసిన ఫైటింగ్ ను అక్కడి ఓ ఉద్యోగి వీడియో తీశారు. ఈ వీడియోలో ఒకదానితో మరొకటి పోరాటం మొదలుపెట్టిన కంగారూలు.. వేగంగా పోట్లాడాయి.
  • ఒకదానిని ఒకటి చుట్టేస్తూ.. దారి నుంచి పక్కకు తొలగాయి. ఈ క్రమంలో ఓ కంగారూ మరో దానిపై ఆధిపత్యం చెలాయించింది. తన రెండు కాళ్లు ఎత్తి బలంగా మరో కంగారూను బలంగా తన్నేసింది. 
  • దెబ్బకు రెండో కంగారూ వెనక్కి పడిపోయింది. ఈ ధాటికి అక్కడున్న రేకుల ఫెన్సింగ్ విరిగిపోయింది. ఆ ఫెన్సింగ్ మీదుగా కంగారూ ఆ పక్కకి పడిపోయింది.
  • మరో చిత్రం ఏమిటంటే.. రెజ్లింగ్, కుస్తీ పోటీల్లో గెలిచిన వారు ప్రత్యర్థులు పడిపోవడాన్ని చూస్తూ నిలబడినట్టుగానే.. ఈ పోటీలోనూ గెలిచిన కంగారూ పడిపోయిన కంగారూ వైపు చూస్తూ నిలబడటం గమనార్హం.
  • స్కై న్యూస్ సంస్థ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. పెద్ద సంఖ్యలో వ్యూస్, లైకులు వస్తున్నాయి.

ఇంతకుముందు థాయిలాండ్ లో నడి రోడ్డుపై రెండు భారీ బల్లులు కుస్తీ పట్టి ట్రాఫిక్ ఆగిపోయిన వీడియో కూడా వైరల్ గా మారింది.
భారీ బల్లులు రోడ్డుపై పోరాటానికి దిగిన వీడియో లింక్ ఇదిగో..





More Telugu News