రెండేళ్ల త‌ర్వాత భ‌క్తుల స‌మ‌క్షంలో తిరుమ‌ల వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వాలు... షెడ్యూల్ ఇదిగో

  • ఈ నెల 20న శ్రీవారి ఆల‌యంలో కోయిల్ అళ్వార్ తిరుమంజ‌నం
  • 26న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌
  • అక్టోబ‌ర్ 1న గ‌రుడ వాహ‌న సేవ‌
తిరుమ‌ల‌ శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ఈ ద‌ఫా భ‌క్తుల స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌నున్నాయి. క‌రోనా కార‌ణంగా భ‌క్తులు లేకుండా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)... క‌రోనా విస్తృతి బాగా త‌గ్గిన నేప‌థ్యంలో ఈ ఏడాది శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను భ‌క్తుల స‌మ‌క్షంలో నిర్వ‌హించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం బ్ర‌హ్మోత్స‌వాల‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టీటీడీ విడుద‌ల చేసింది. 

ఈ షెడ్యూల్ ప్ర‌కారం.. బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కావ‌డానికి ముందుగా ఈ నెల 20న ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీవారి ఆల‌యంలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా కోయిల్ అళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఈ నెల 26న బ్ర‌హ్మోత్స‌వాలకు అంకురార్ప‌ణ జ‌ర‌గ‌నుండ‌గా.... ఈ నెల 27 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు 9 రోజుల పాటు వివిధ రూపాల్లో వివిధ వాహ‌న సేవ‌ల్లో శ్రీవారు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. 

శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆయా వాహ‌న సేవ‌ల వివ‌రాలు
# సెప్టెంబ‌ర్ 26   బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌
# సెప్టెంబ‌ర్ 27   ధ్వ‌జారోహ‌ణం, పెద్ద శేష వాహ‌న సేవ‌
# సెప్టెంబ‌ర్ 28   చిన్న శేష వాహ‌నం, స్న‌ప‌న తిరుమంజ‌నం, హంస వాహ‌న సేవ‌
#  సెప్టెంబ‌ర్ 29   సింహ వాహ‌న సేవ‌, ముత్య‌పు పందిరి వాహ‌న సేవ‌
#  సెప్టెంబ‌ర్ 30   క‌ల్ప‌వృక్ష వాహ‌న సేవ‌, స‌ర్వ భూపాల వాహ‌న సేవ‌
#   అక్టోబ‌ర్  01  మోహిని అవ‌తారంలో స్వామి వారి ద‌ర్శ‌నం, గ‌రుడ వాహ‌న సేవ‌
#   అక్టోబ‌ర్  02  హ‌నుమంత వాహ‌న సేవ‌, గ‌జ వాహ‌న సేవ‌
#   అక్టోబ‌ర్  03  సూర్యప్ర‌భ వాహ‌న సేవ‌, చంద్ర‌ప్ర‌భ వాహ‌న సేవ‌
#   అక్టోబ‌ర్  04  ర‌థోత్స‌వం, అశ్వ వాహ‌న సేవ‌
#   అక్టోబ‌ర్  05  చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం


More Telugu News