ఆసక్తిని రేకెత్తిస్తున్న 'ఒకే ఒక జీవితం' ట్రైలర్!
- శర్వానంద్ హీరోగా రూపొందిన 'ఒకే ఒక జీవితం'
- టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే కథ
- కీలకమైన పాత్రను పోషించిన అమల అక్కినేని
- ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల
మొదటి నుంచి కూడా శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'ఒకే ఒక జీవితం'. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
తల్లీ కొడుకుల మధ్య అనుబంధం .. కాలంలో వెనకెక్కి వెళ్లి తన తల్లిని కలుకోవాలనే హీరో కోరిక .. అది ఎలా సాధ్యమైందనే ఆసక్తికరమైన అంశాలతో కూడిన సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. ఇది టైమ్ ట్రావెల్ కి సంధించిన కథ అనే విషయం ట్రైలర్ తోనే అర్ధమయ్యేలా చేయడంలో టీమ్ సక్సెస్ అయింది.
ఈ తరహా జోనర్ లో శర్వా చేసిన ఫస్టు మూవీ ఇది. ఆయన తల్లిగా అమల అక్కినేని నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలను వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి .. నాజర్ పోషించారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నారు.