ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు
- ఈ నెల 30 వరకే చార్జీల తగ్గింపు అమల్లో ఉంటుందని ప్రకటన
- విజయవాడ- హైదరాబాద్ రూట్లో 10 శాతం చార్జీల తగ్గింపు
- విజయవాడ- విశాఖ మధ్య నడిచే డాల్ఫిన్ క్రూయిజ్‌లో 20శాతం తగ్గింపు
- విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు రూట్లలోనూ 20 శాతం తగ్గనున్న చార్జీలు
ఏపీలో ఏసీ ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చార్జీల తగ్గింపు తాత్కాలికమేనని పేర్కొంది. ఈ క్రమంలో పలు రూట్లలో నడిచే ఏసీ బస్సుల్లో 10 నుంచి 20 శాతం మేర చార్జీలు తగ్గాయి. ఇక ఈ చార్జీల తగ్గింపు ఈ నెల 30 వరకు మాత్రమే అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఇదిలా ఉంటే... ఆయా రూట్లు, వాటిలో ఎంతమేర చార్జీ తగ్గించాలన్న విషయాన్ని రీజనల్ మేనేజర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తమ పరిధిలోని రూట్లు, వాటిలో తిరిగే బస్సుల్లో చార్జీల తగ్గింపునకు సంబంధించి జిల్లాల రీజనల్ మేనేజర్లు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. విజయవాడ- హైదరాబాద్ ఏసీ బస్సుల్లో 10 శాతం చార్జీలను తగ్గించారు. ఈ రూట్లో తిరిగే ఏసీ బస్సులు అమరావతి, గరుడ, వెన్నెల బస్సుల్లో ఈ చార్జీల తగ్గింపు అమలు కానుంది. విజయవాడ- విశాఖ మధ్య నడిచే డాల్ఫిన్ క్రూయిజ్‌లో 20 శాతం మేర చార్జీలను తగ్గించారు.
అలాగే, విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే బస్సుల్లోనూ 20 శాతం చార్జీలను తగ్గించారు. మరోవైపు అన్ని రూట్లలో అమరావతి, వెన్నెల బస్సుల్లో శుక్రవారం, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లోనే చార్జీ తగ్గింపు అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు.