కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు... వీడియో ఇదిగో
- తెలంగాణ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్
- కామారెడ్డిలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న యువజన కాంగ్రెస్ శ్రేణులు
- నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదలపై నినాదాలు
- కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు శుక్రవారం నిరసన సెగ తగిలింది. జహీరాబాద్ పార్లమెంటు కో ఆర్డినేటర్‌గా నియమితులైన నిర్మల... నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులతో సమావేశాల కోసం గురువారం తెలంగాణకు వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి కామారెడ్డికి చేరుకున్న నిర్మల.... రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం కామారెడ్డి పరిధిలో పర్యటనకు బయలుదేరారు.
ఈ సందర్భంగా నిర్మల కాన్వాయ్‌కు యువజన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుగా నిలిచాయి. కామారెడ్డి నుంచి బయలుదేరే సందర్భంగా ఉన్నట్లుండి ఆమె కాన్వాయ్‌ను అడ్డగించిన కాంగ్రెస్ నేతలు బీజేపీ సర్కారు తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. అయితే వెనువెంటనే స్పందించిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను ముందుకు కదిలించారు.