నీరజ్ చోప్రా జావెలిన్ ను వేలంలో రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన బీసీసీఐ
- టోక్యో ఒలింపిక్స్ లో చోప్రాకు స్వర్ణం
- తన జావెలిన్ ను ప్రధాని మోదీకి బహూకరించిన చోప్రా
- ఇతర జ్ఞాపికలతో కలిపి దాన్ని కూడా వేలానికి ఇచ్చిన మోదీ
- 1,348 జ్ఞాపికలతో ఇ-వేలం
- తాజాగా బిడ్లు తెరిచిన వైనం
గతేడాది జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో భారత జావెలిన్ వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించడం తెలిసిందే. నీరజ్ చోప్రా ఉపయోగించిన జావెలిన్ ను గతేడాది ఆన్ లైన్ లో వేలం వేశారు. ఈ జావెలిన్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది.
టోక్యో ఒలింపిక్స్ అనంతరం నీరజ్ చోప్రా తాను ఉపయోగించిన జావెలిన్లలో ఒకదాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు. మోదీ వద్ద ఉన్న వివిధ వస్తువులతో పాటు ఈ జావెలిన్ ను కూడా ఇ-వేలం ప్రక్రియలో ఉంచారు. గతేడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్యన ఈ వేలం నిర్వహించారు. తాజాగా బిడ్లను తెరవగా, బీసీసీఐ అత్యధిక ధరతో నీరజ్ చోప్రా జావెలిన్ ను సొంతం చేసుకుంది.
అదే సమయంలో, ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి ఖడ్గం వేలంలో రూ.1.25 కోట్లు పలికింది. పారాలింపిక్ చాంపియన్ సుమీత్ ఆంటిల్ కు చెందిన జావెలిన్ కు రూ.1 కోటి ధర పలికింది. ఇక, మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కు చెందిన గ్లోవ్స్ కు రూ.91 లక్షల ధర లభించింది.
ఈ ఇ-వేలంలో ప్రధానికి లభించిన 1,348 జ్ఞాపికలను విక్రయానికి ఉంచగా, మొత్తం 8,600 బిడ్లు దాఖలయ్యాయి.