తీస్తా సెతల్వాద్‌కు ఊరట... మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
- గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రకు పాల్పడ్డారని సెతల్వాద్‌పై కేసు
- జూన్ నుంచి జైల్లోనే ఉంటున్న ఉద్యమకారిణి
- సెతల్వాద్ పిటిషన్‌ను 6 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
- ఫలితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సెతల్వాద్
ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్రవారం భారీ ఊరట లభించింది. గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఆమెను ఈ ఏడాది జూన్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ నుంచి జైల్లోనే ఉంటున్న ఆమె తనకు బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేయడంతో సెతల్వాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది. జూన్ నుంచి సెతల్వాద్ జైల్లోనే ఉన్న నేపథ్యంలో ఈ కేసులో ఆమెను విచారించేందుకు పోలీసులకు తగినంత సమయం దొరికినట్టేనన్న సుప్రీంకోర్టు... సెతల్వాద్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించింది.